Share News

కర్ణాటక ప్రయోజనాలను కాపాడుకుంటాం.. మేకెదాటుపై ప్రియాంక్ ఖర్గే

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:29 PM

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

కర్ణాటక ప్రయోజనాలను కాపాడుకుంటాం.. మేకెదాటుపై ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge

బెంగళూరు: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


'మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం నా బాధ్యత. వాళ్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లు (తమిళనాడు) తీర్మానం చేశారు. కోర్టు ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉంది. సముద్రంలో కలిసి పోయే అదనపు జలాలను మాత్రమే మేము నిల్వ చేస్తాం. దానిని మా రాష్ట్ర ప్రజల అవసరాలు, ముఖ్యంగా బెంగళూరు అవసరాలు, స్థానిక జిల్లాల అవసరాల కోసం వినియోగిస్తాం. కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఎవరికీ అన్యాయం జరగకుండా మేము చూస్తాం' అని ఖర్గే తెలిపారు.


మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతో పాటు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులు సహా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార, విపక్ష పార్టీలు పూర్తి మద్దతు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి

చీలిక దిశగా శరద్‌పవార్ ఎన్సీపీ!

Updated Date - Jun 19 , 2026 | 05:56 PM