Share News

కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:27 AM

కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుదుపు చోటు చేసుకుంది. ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి నాగేంద్ర తన పదవికి...

కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా

బెంగళూరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుదుపు చోటు చేసుకుంది. ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం డీకే శివకుమార్‌కు అందించినట్టు వెల్లడించారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ నిధుల కుంభకోణంలో నాగేంద్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నాగేంద్ర పేరును ప్రధాన నిందితుడిగా చేర్చింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ నాయకులు ఆయన రాజీనామాకు డిమాండ్‌ చేశాయి. ఆయన రాజీనామా చేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. మీడియా సమావేశంలో రాజీనామా విషయాన్ని వెల్లడిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 2023 ఎన్నికల తర్వాత సిద్దరామయ్య కేబినెట్‌లో నాగేంద్రకు అవకాశం లభించింది. ఈ క్రమంలో ఆయన వాల్మీకి అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ నిధులు రూ.187 కోట్లు పక్కదారి పట్టినట్లు 2024లో బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ వ్యవహారంలోనే నాగేంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో మంత్రి పదవికి అప్పట్లో కూడా ఆయన రాజీనామా చేశారు. తాజాగా శివకుమర్‌ సీఎం అయ్యాక నాగేంద్ర మళ్లీ మంత్రి అయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:27 AM