మతాలన్నింటిలో ఇస్లాం పవిత్రమైనది
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:26 AM
అన్ని మతాలకంటే ఇస్లాం పవిత్రమైనదంటూ కర్ణాటక ఉన్నతవిద్యాశాఖ మంత్రి బసవరాజరాయరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
కర్ణాటక మంత్రి బసవరాజ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అన్ని మతాలకంటే ఇస్లాం పవిత్రమైనదంటూ కర్ణాటక ఉన్నతవిద్యాశాఖ మంత్రి బసవరాజరాయరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇస్లాం పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని గురించి లోతుగా ఆలోచించాల్సి ఉంది’ అని కూడా మంత్రి వ్యాఖ్యానించారు. కొప్పళ జిల్లా కుకనూరులో ఆదివారం ముస్లింల సామూహిక వివాహాల్లో పాల్గొన్న ఆయన...‘నేను గుడులు, మఠాలకు వెళ్లను. కానీ హజ్‌యాత్రకు వెళ్లాలనే ఆశ ఉంది. కానీ అక్కడికి వెళ్లాలంటే ఇస్లాంలోకి చేరాల్సి ఉంటుంది. నేను ఖురాన్ అధ్యయనం చేయాలని అనుకుంటున్నాను.’ అని అన్నారు. బసవరాజ వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. దీంతో ఆయన సోమవారం వివరణ ఇచ్చారు. సమాజంలో అన్నిమతాలు ముఖ్యమైనవేనని, ఏ మతం కూడా తక్కువ కాదని చెప్పుకొచ్చారు. తాను నిర్దిష్టమైన ఏ మతానికీ అనుచరుడిని కాదని, తనకు కులం, మతం అనే భేదాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి