కావేరీ జలాల వివాదం.. తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవ్: డీకే శివకుమార్
ABN , Publish Date - Jul 31 , 2026 | 04:50 PM
కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవని తేల్చి చెప్పారు.
బెంగళూరు, జులై 31: కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవని తేల్చి చెప్పారు. తమిళనాడుకు 15 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎమ్ఏ) కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రో కన్నడ గ్రూపులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలెట్టాయి. విపక్షాలు ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం మధ్యాహ్నం విధాన సౌధలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీడబ్ల్యూఎమ్ఏ ఆదేశాలపై ప్రభుత్వం చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రస్తుతానికి సానుకూల వాతావరణం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఈ వివాదంపై చర్చించేందుకు ఆగస్టు మొదటి వారంలో ఆల్ పార్టీ మీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాలు, రైతు సంఘాలతో పూర్తిగా చర్చించిన తర్వాతే నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విపక్షాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకోవాలని సీఎం కోరారు.
ఇవి కూడా చదవండి
ఆయన దీక్ష చేయకపోతే ధర్మేంద్ర రాజీనామా సాధ్యమయ్యేదే కాదు: అభిజీత్ దీప్కే
మార్కెట్‌లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్