కర్ణాటకలో 60 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:29 AM
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50-60 లక్షల ఓట్లను తొలగించేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్రపన్నాయని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. సదాశివనగర్‌లోని తన నివాసం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు
ముఖ్యమంత్రి డీకే శివకుమార్
బెంగళూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50-60 లక్షల ఓట్లను తొలగించేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్రపన్నాయని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. సదాశివనగర్‌లోని తన నివాసం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత, గిరిజన, సంచారజాతులు, ముస్లిం సామాజికవర్గాల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు ఫారం-7ను సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తి 100-200 పైగా దరఖాస్తులు సమర్పిస్తున్నారని తెలిపారు. సదరు అర్జీలలో ఓటర్ల వివరాలను ముందుగానే ముద్రించారని, ఈ వివరాలు బీజేపీ వారికి ఎలా లభించాయని, వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇది చిన్న విషయం కాదని, లక్షలాది మంది ఓట్లను ఏవిధంగా తొలగిస్తారని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు