కారు పార్కింగ్ విషయంలో గొడవ.. కార్గిల్ వెటరన్‌పై దాడి..
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:05 AM
1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వాయుసేన నిర్వహించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో పాల్గొన్న రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై గురుగ్రామ్‌లో పార్కింగ్ సిబ్బంది ఇనుప రాడ్‌తో దాడి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కారు పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వాయుసేన నిర్వహించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో పాల్గొన్న రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై గురుగ్రామ్‌లో పార్కింగ్ సిబ్బంది ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమవడంతో పాటు చేతికి ఫ్రాక్చర్ అయింది (Amit Kumar Gupta attacked).
గురుగ్రామ్‌లోని మ్యాగ్నమ్ గ్లోబల్ పార్క్‌లోని గోంజో రెస్టారెంట్‌కు గుప్తా తన కుటుంబంతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులను రెస్టారెంట్ వద్ద దింపిన అనంతరం తన కారును పార్క్ చేసేందుకు వెళ్లారు. అయితే వాలెట్ పార్కింగ్, బేస్‌మెంట్, మల్టీలెవల్ పార్కింగ్ అంటూ సిబ్బంది ఆయనను పలుచోట్లకు తిప్పారు. ఆ సమయంలో తాను కారును రివర్స్ చేయడానికి ప్రయత్నించగా ఓ పార్కింగ్ అటెండెంట్ తన కారు విండ్‌షీల్డ్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశాడని గుప్తా ఆరోపించారు (Operation Safed Sagar veteran).
తాను కారు నుంచి బయటకు వచ్చి ప్రశ్నించగా, సదరు వ్యక్తి ఇనుప రాడ్ తీసుకొచ్చి తనపై దాడి చేశాడని తెలిపారు. ముందుగా చేతిపై, ఆ తర్వాత తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడని, దీంతో రక్తస్రావమైందని ఆయన వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరించాడని కూడా ఆరోపించారు. తాను పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ సుమారు అరగంట పాటు పోలీసులు అక్కడికి రాలేదని తెలిపారు (Gurugram parking attendant attack).
చివరకు ఓ రెస్టారెంట్ చెఫ్ జోక్యం చేసుకోవడంతో తన ప్రాణాలు దక్కాయని ఆయన చెప్పారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఆయనను అంబులెన్స్‌లో మెదాంతా ఆసుపత్రికి తరలించారు. చేతి మోచేయి ఎముకకు గాయమవడంతో ప్లేట్లు అమర్చి శస్త్రచికిత్స చేసినట్లు గుప్తా తెలిపారు. తనకు అందిన మెడికో-లీగల్ కేసు (ఎంఎల్‌సీ) రిపోర్టులో తల నుంచి జరిగిన రక్తస్రావం, మోచేయి గాయం గురించి ప్రస్తావించలేదని గుప్తా ఆరోపించారు. ఆసుపత్రి తప్పుడు రిపోర్టు ఇచ్చిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..