నటికి దారుణ అనుభవం.. ప్రైవేట్ వీడియో తీసి బెదిరింపులు..
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:19 PM
బెంగళూరుకు చెందిన ఓ నటికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొందరు దుర్మార్గులు ఆమె ప్రైవేట్ వీడియో తీసి, బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేకపోయిన నటి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది..
ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు వెళ్లిన 32 ఏళ్ల కన్నడ నటికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొందరు దుర్మార్గులు ఆమె ప్రైవేట్ వీడియో తీసి, బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేకపోయిన నటి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. నటి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఫిబ్రవరి 7వ తేదీన ఆ నటి ఓ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడ ఉమెన్స్ రెస్ట్‌రూమ్‌ను ఊపయోగించింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ రెస్ట్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి, వీడియోను చిత్రీకరించారు.
ఆ వీడియోను అడ్డుపెట్టుకుని నటిపై బెదిరింపులకు దిగారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. వారి వేధింపులు రోజురోజుకూ పెరగటంతో చివరకు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగించి వారిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏప్రిల్ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు
కమల్ హాసన్ పార్టీకి టార్చిలైటు గుర్తు