వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్
ABN , Publish Date - Aug 28 , 2026 | 05:02 PM
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. రాక్షా బంధన్ (రాఖీ) పండగును పురస్కరించుకుని ఇద్దరూ రాజీ పడ్డారు. వివాదాలకంటే చర్చలే బెటరని తీర్మానించారు. జెన్ జీని విమర్శిస్తూ ఇటీవల కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై రామ్ దేవ్ బాబా ఘాటుగా స్పందించడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. బాబా రామ్‌దేవ్ విమర్శలపై ఎంపీ కంగన పలు ఇంటర్వ్యూల్లో మరింతగా విరుచుకుపడటంతో వివాదం ముదిరింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ భారత్‌లో ద్వేషానికి, శత్రుత్వానికి స్థానం లేదని అన్నారు. కంగన వైపు స్నేహహస్తం చాచారు. ‘పండుగ వేళ సోదరి కంగనా రనౌత్ కోసం ఈ స్వీట్స్, బహుమతులు పంపిస్తున్నాను. మన దేశంలో ద్వేషం, శత్రుత్వ భావనలకు స్థానం ఉండకూడదు. ఇటీవల సోదరి కంగనతో వివాదం మొదలైంది. అయితే, ఈ కాంట్రవర్సీకి చర్చలతో ముగింపు పలకాలి. కాబట్టి రక్షాబంధన్ పండుగ రోజున నేను సోదరికి శుభాకాంక్షలు చెబుతున్నాను’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘పొరపాట్లను మర్చిపోయేందుకు, క్షమించేందుకు పండుగలు ఓ మంచి సందర్భం. చర్చలు తప్ప వివాదాలకు తావు లేదని సోదరుడు రామ్ దేమ్ జీ మంచి మాట చెప్పారు. ఈ రక్షా బంధన్ రోజున ఆయన సోదర ప్రేమతో స్వీట్స్ పంపినందుకు ఎంతో ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అని తన పోస్టును ముగించారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు