జెన్ జీ రీల్స్ వాంతులొచ్చేలా ఉన్నాయి.. కంగనా రనౌత్ వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:05 PM
జెన్ జీ నిరసనలకు సంబంధించిన వైరల్ వీడియోలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోల్లో కనిపించిన నిరసనకారుల భాష, ప్రవర్తన తనకు తీవ్ర అసహనం కలిగించాయని, వాంతులొచ్చేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై జెన్ జీ నిరసనకారులకు సంబంధించిన వైరల్ వీడియోలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోలు తనకు అసహ్యం కలిగించాయని, వాటిని చూస్తే వాంతులొచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిరసనకారుల భాష, ప్రవర్తనపై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు.
'జెన్ జీ నిరసనల నుంచి వచ్చిన ఈ రీల్స్ చూస్తే అసహ్యం కలుగుతోంది. వారు మాట్లాడే తీరు, ఉపయోగించే భాష బాధ కలిగిస్తోంది. ఇలాంటి ప్రవర్తన ఉన్న వారికి తల్లిదండ్రులు ఎవరు? వీరిని ఎలా పెంచారు?' అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, హుందాతనానికి పేరుగాంచిన దేశమని, ఇలాంటి ప్రవర్తన దేశ విలువలకు విరుద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

' మిమ్మల్ని మీరు బొద్దింకలుగా పిలుచుకుంటున్నారు.. మీ ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తోంది. దీని ద్వారా మీలోని అసభ్యత, అసహనం మాత్రమే బయటపడుతోంది' అంటూ ఆమె విమర్శించారు. ఈ వీడియోలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలనే ఆలోచన కలిగిందని కంగనా తెలిపారు.
Also Read:
చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చింది?
‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ