విజయ్‌ని ఆహ్వానించాలి
ABN , Publish Date - May 08 , 2026 | 05:52 AM
తమిళనాడులో టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు మద్దతుగా సినీ తారలు గొంతు విప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలని, కానీ గవర్నర్ చేయకపోవడాన్ని ‘ఎక్స్’ వేదికగా...
గవర్నర్ తీరు రాజ్యాంగవిరుద్ధం
విజయ్‌కి కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, విశాల్ మద్దతు
ప్రజల నిర్ణయాన్ని తప్పక అంగీకరించాలి: ఖుష్బూ
చెన్నై, మే 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు మద్దతుగా సినీ తారలు గొంతు విప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలని, కానీ గవర్నర్ చేయకపోవడాన్ని ‘ఎక్స్’ వేదికగా వారు నిరసించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, విజయ్ పట్ల గవర్నర్ తీరు సరికాదని మక్కల్ నీదిమయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ అన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇకపై వ్యవహరిస్తామన్న డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటన ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనమని కమల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి పూర్తి హక్కు ఉన్నదని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఆ హక్కును తీసివేసేలా గవర్నర్ ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడులో గవర్నర్ పాలన కాదు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని హీరో విశాల్ వ్యాఖ్యానించారు. టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గవర్నర్ ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ ఓ ప్రకటన చేస్తూ.. ‘తమిళనాడు ప్రజలు టీవీకే నాయకుడు విజయ్‌ను తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మనం దానిని తప్పక అంగీకరించాలి’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest National News And Telugu News