పోలీసులమని చెప్పి.. కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారు!
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:04 AM
జంతర్‌మంతర్‌లో వేలాదిమంది విద్యార్థులకు కొన్ని వారాలపాటు ఆహారం, నీళ్లు అందించిన మహమ్మద్ జునైద్.. తనను...
జంతర్‌మంతర్‌లో విద్యార్థులకు ఆహారం అందించిన జునైద్ ఆరోపణ
న్యూఢిల్లీ, జూలై 27: జంతర్‌మంతర్‌లో వేలాదిమంది విద్యార్థులకు కొన్ని వారాలపాటు ఆహారం, నీళ్లు అందించిన మహమ్మద్ జునైద్.. తనను, తన కుటుంబసభ్యులను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తననైతే ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మరుసటి రోజు వదిలిపెట్టారని తెలిపారు. ఢిల్లీ పోలీసులమని చెప్పి కొందరు శుక్రవారం తన కళ్లకు గంతలు కట్టి ఓ వాహనంలో తీసుకెళ్లారని, ఆహారం పంపిణీ చేయటానికి డబ్బులు ఎవరు ఇచ్చారని అడిగారని, ఆ తర్వాత ముస్సౌరీలో వదిలేస్తే.. అక్కడి నుంచి తాను తిరిగి ఢిల్లీకి వచ్చానని జునైద్ పేర్కొన్నారు. మరోవైపు, యూపీలో తన తండ్రిని, తమ్ముడిని విచారణ పేరుతో పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఆధార్, పాన్‌కార్డు మొదలైన పత్రాలను తీసుకున్నారని, తన సోదరి భర్త, మామ తదితరులను కూడా ఇదే విధంగా విచారణ కోసమంటూ వేధింపులకు గురి చేశారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News