Share News

‘బస్తర్‌’ దాడి కేసు..

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:13 AM

ఛత్తీ్‌సగఢ్‌, బస్తర్‌ జిల్లాలోని ఝీరాం వ్యాలీలో 13 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ నేతలే లక్ష్యంగా మావోయిస్టులు చేసిన భీకరదాడికి సంబంధించిన కేసులో తుది తీర్పు వెలువడింది. నాడు..

‘బస్తర్‌’ దాడి కేసు..

  • 10 మంది మావోయిస్టులకు మరణ శిక్ష

  • 2013లో ఘటన.. దాడిలో కాంగ్రెస్‌ నేతలు

  • విద్యాచరణ్‌ శుక్లా, నంద్‌కుమార్‌ పటేల్‌,

  • ఆయన కుమారుడు దినేశ్‌,

  • మహేంద్ర కర్మ సహా 29 మంది మృతి

  • 13 ఏళ్ల తర్వాత ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఛత్తీ్‌సగఢ్‌, బస్తర్‌ జిల్లాలోని ఝీరాం వ్యాలీలో 13 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ నేతలే లక్ష్యంగా మావోయిస్టులు చేసిన భీకరదాడికి సంబంధించిన కేసులో తుది తీర్పు వెలువడింది. నాడు మావోయిస్టులు చేసిన దాడిలో మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్‌ శుక్లా, నాటి ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నంద్‌ కుమార్‌ పటేల్‌, ఆయన కుమారుడు దినేష్‌, శాసనసభ మాజీ ప్రతిపక్షనేత మహేంద్ర కర్మ, మాజీ ఎమ్మెల్యే విజయ్‌ ముదియార్‌ సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన కేసులో దోషులుగా తేలిన 10 మందికి మరణ శిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి అభయ్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బుధవారం తీర్పు వెల్లడించారు. ఈ పది మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఘటన జరిగిన 13 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. 2013 మే 25న ఝీరాం వ్యాలీలో కాంగ్రెస్‌ చేపట్టిన పరివర్తన్‌ ర్యాలీని మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. ఝీరాం వ్యాలీలో జాతీయ రహదారిలోకాంగ్రెస్‌ నేతలపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అగ్రనాయకులు, ప్రజలు, భద్రతా సిబ్బంది కలిపి 29 మంది మరణించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అభయ్‌సింగ్‌ ఈ ఏడాది సెప్టెంబరు 5 పది మందిని దోషులుగా నిర్ధారించారు. వారందరికీ బుధవారం శిక్ష ఖరారు చేశారు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 06:13 AM