Share News

ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:42 AM

ఝార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్సీ), ఝార్ఖండ్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (జేఎ్‌సఎస్సీ) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన...

ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం

రాంచీ, ఆగస్టు 16: ఝార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్సీ), ఝార్ఖండ్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (జేఎ్‌సఎస్సీ) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన నిరసనలను విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉధృతం చేశారు. రాంచీలోని జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో ‘జేపీఎస్సీ- జేఎ్‌సఎస్సీ రీఫార్మ్స్‌ మంచ్‌’ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలు ఆదివారానికి 22వ రోజుకు చేరుకున్నాయి. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సోరెన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న సీఎం నివాసాన్ని ముట్టడిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సీఎం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి వెంటనే తమ మద్దతును ఉపసంహరించుకోవాలని రాహుల్‌గాంధీపై విద్యార్థి సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి.

వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 17 , 2026 | 06:42 AM