Share News

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురి మృతి

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:19 PM

జార్ఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఏడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్కూటీ ప్రమాదాన్ని పరిశీలించేందుకు రోడ్డుపైకి వచ్చిన వారిపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురి మృతి
Jharkhand Road Accident

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన స్కూటీని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్న వారిపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

లారీ ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడగా.. ఘటనాస్థలం వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖుంటి సదర్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని పాకో దేవి, కసిలా దేవి, మన్హు దేవి, గోలు కుమార్, అంజలి కుమారి, తూటీ కుమారి, సౌరభ్ నాయక్‌గా గుర్తించారు. ఒకే ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.


పరారీలో లారీ డ్రైవర్..

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట స్కూటీ ప్రమాదం ఎలా జరిగింది? ఆ తర్వాత లారీ అక్కడున్న జనాలపైకి ఎలా దూసుకొచ్చింది? డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 12:34 PM