Share News

జేఎస్‌ఎస్సీ- సీజీఎల్‌ పరీక్ష రద్దు

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:29 AM

ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఝార్ఖండ్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (జేఎస్‌ఎస్సీ) నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) పరీక్షతో...

జేఎస్‌ఎస్సీ- సీజీఎల్‌ పరీక్ష రద్దు

  • 2014 నుంచి జరిగిన అక్రమాలపై విచారణ

  • ఝార్ఖండ్‌లో విద్యార్థుల

  • నిరసనలకు దిగొచ్చిన ప్రభుత్వం

రాంచీ, ఆగస్టు 17: ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఝార్ఖండ్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (జేఎస్‌ఎస్సీ) నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) పరీక్షతో పాటు టీడీపీఎల్‌ సంస్థ ద్వారా నిర్వహించిన అన్ని పరీక్షలు, వాటి ఆధారంగా చేపట్టిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్‌ సోరెన్‌ సోమవారం ప్రకటించారు. అంతేకాకుండా 2014నుంచి టీడీపీఎల్‌ నిర్వహించిన అన్ని పరీక్షలపై సీఐడీతో పాటు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీతోనూ విచారణ చేపడతామని సోరెన్‌ వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇప్పటికే వారితో చర్చలు జరిపిందని, ఆందోళనకారుల పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. సీఐడీ, సిట్‌ విచారణల్లో పలు కీలక ఆధారాలు బయటపడ్డాయని సోరెన్‌ పేర్కొన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డవారిని అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల ఫిర్యాదులను ప్రత్యేక పోర్టల్‌ ద్వారా స్వీకరించి, వాటిని నిపుణుల బృందంతో అధ్యయనం చేస్తామని, ప్రభుత్వం చేపట్టనున్న పరీక్షా సంస్కరణలకు ఐఏఎస్‌ అధికారి అమితాబ్‌ కౌశల్‌ నేతృత్వం వహిస్తారని సీఎం ప్రకటించారు. అంతకుముందు రాహుల్‌ గాంధీ.. ఝార్ఖండ్‌ విద్యార్థులు, వారి ప్రతినిధులతో స్వయంగా మాట్లాడాలని సోరెన్‌కు లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 06:29 AM