Share News

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ మార్కుల లీక్‌ అబద్ధం

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:32 AM

లక్షలాది మంది జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థుల కీలకమైన సమాచారం బహిర్గతమైందని, విద్యార్థుల అడ్మిట్‌ కార్డులు, మార్కుల వివరాలు లీక్‌ అయ్యాయన్న వార్తలను ఐఐటీ రూర్కీ ఖండించింది...

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ మార్కుల లీక్‌ అబద్ధం

  • సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు: ఐఐటీ రూర్కీ

న్యూఢిల్లీ, జూన్‌ 5: లక్షలాది మంది జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థుల కీలకమైన సమాచారం బహిర్గతమైందని, విద్యార్థుల అడ్మిట్‌ కార్డులు, మార్కుల వివరాలు లీక్‌ అయ్యాయన్న వార్తలను ఐఐటీ రూర్కీ ఖండించింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. కానీ, విద్యార్థుల డేటాను భద్రపర్చిన క్లౌడ్‌ స్టోరేజీలో సాంకేతిక సమస్య వాస్తవమేనని అంగీకరించింది. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఈ ఏడాది మే నెలలో ఐఐటీ రూర్కీ నిర్వహించింది. విద్యార్థుల డేటాను తాత్కాలికంగా క్లౌడ్‌ స్టోరేజీలో భద్రపర్చింది. అయితే, విద్యార్థుల అడ్మిట్‌ కార్డులు, మార్కులు ఉన్న ఈ క్లౌడ్‌ డేటాబేస్‌ లీక్‌ అయినట్లు, పాస్‌వర్డ్‌ లేకపోయినా వాటిని డౌన్‌లోడ్‌ చేయగలుగుతున్నట్లు అనిల్‌ అనే 16ఏళ్ల ఎథికల్‌ హ్యాకర్‌ గుర్తించి ఐఐటీ రూర్కీ దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో, విద్యార్థుల మార్కులు లీక్‌ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై ఐఐటీ రూర్కీ శుక్రవారం వివరణ ఇచ్చింది. పరీక్ష ముగిసినప్పటికీ కొందరు విద్యార్థులు అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు ఇబ్బంది పడ్డారని, దీన్ని పరిష్కరిండచంతో పాటు, పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం ఈ నెల 2న జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక మార్పులు(అ్‌పడేట్‌) చేశామని, ఈ క్రమంలోనే క్లౌడ్‌ స్టోరేజీలో టెక్నికల్‌ ఇబ్బందులు వచ్చాయని వివరించింది. ఈ సమయంలో కేవలం 0.05ుడేటా మాత్రమే బహిర్గతమైందని, ఎవరూ మొత్తం డేటాను డౌన్‌లోడ్‌ చేయలేదని ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ఆ 0.05ు సమాచారం కూడా రీడ్‌ ఓన్లీ(కేవలం చదవలగరు. మార్చడానికి వీలు ఉండదు) ఫార్మాట్‌లో ఉందని, దాన్ని ఎవరూ మార్చలేరని తెలిపింది. ఈ ప్రభావం ఫలితాలపై ఉండబోదని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 05:32 AM