Share News

జంతర్ మంతర్ ధర్నా ఉద్రిక్తతలు.. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆత్యవసర లేఖ!

ABN , Publish Date - Oct 10 , 2026 | 10:55 AM

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా CJP నిర్వహించ తలపెట్టిన భారీ ధర్నా నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

జంతర్ మంతర్ ధర్నా ఉద్రిక్తతలు.. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆత్యవసర లేఖ!

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా 'సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' (CJP) సంస్థ జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన భారీ ధర్నాను ఢిల్లీ పోలీసులు తిరస్కరించిన నేపథ్యంలో.. శాంతిభద్రతల విఘాతం కలగకుండా కేంద్ర హోంశాఖ (MHA) తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఢిల్లీ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ లేఖలో ఆందోళనకారులు ఢిల్లీ వైపు రాకుండా చూడాలని, సరిహద్దుల వద్ద అత్యంత అప్రమత్తత వహించాలని సూచించారు.


సరిహద్దుల్లో పటిష్ట నిఘా

ఢిల్లీకి అనుసంధానంగా ఉన్న అన్ని సరిహద్దు ప్రాంతాలు, టోల్ ప్లాజాలు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారులు గుంపులుగా రాజధానికి తరలిరాకుండా సరిహద్దులోనే అడ్డుకోవాలని సూచించారు. శాంతియుత నిరసనల పేరుతో నగరంలోకి ప్రవేశించి అల్లర్లు, ఆస్తి నష్టం కలిగించే అరాచక లేదా విధ్వంసకర శక్తులు ప్రవేశించకుండా ముందస్తుగా గుర్తించి నిరోధించాలని ఆదేశించారు.


జంతర్ మంతర్ వద్ద నిరసనల నిర్వహణ, బహిరంగ ప్రదర్శనలు, శాంతిభద్రతల నియంత్రణపై 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక మార్గదర్శకాలను హోంశాఖ తన లేఖలో ప్రస్తావించింది. నిరసనలు తెలిపే హక్కు ఉన్నప్పటికీ.. అది చట్టబద్ధమైన అనుమతులు, నిబంధనలు, పౌరుల సాధారణ జీవనానికి ఇబ్బంది కలగకుండా విధించే పరిమితులకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు ఢిల్లీ పోలీసు యంత్రాంగంతో కమ్యూనికేషన్ నెలకొల్పుకుని, సమాచారాన్ని పంచుకుంటూ పరస్పరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

హోంశాఖ ఆదేశాలతో హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దు పోలీసులు సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీ పరిసరాల్లో నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో పూర్తి అప్రమత్తత ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

Updated Date - Oct 10 , 2026 | 10:55 AM