Share News

రూ.20 కచోరీ తినేందుకు ఆగితే.. రూ.20 లక్షలు మాయం..

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:19 PM

రోడ్డు పక్కన కచోరీ తినేందుకు ఆగిన ఓ వ్యాపారికి ఊహించని షాక్ తగిలింది. రూ.20 కచోరీ తినేందుకు ఆగితే రూ.20 లక్షలు మాయమయ్యాయి. అతడు తినే పనిలో ఉండగా ఇద్దరు దొంగలు నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు.

రూ.20 కచోరీ తినేందుకు ఆగితే.. రూ.20 లక్షలు మాయం..
Jaipur businessman robbery video

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు పక్కన కచోరీ తినేందుకు ఆగిన ఓ వ్యాపారికి ఊహించని షాక్ తగిలింది. రూ.20 కచోరీ తినేందుకు ఆగితే రూ.20 లక్షలు మాయమయ్యాయి. అతడు తినే పనిలో ఉండగా ఇద్దరు దొంగలు నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగులో ఏకంగా రూ.20 లక్షలు ఉండటంతో బాధితుడు లబోదిబోమన్నాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి (Jaipur businessman robbery).


జైపూర్‌లోని నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చంపాలాల్ అనే వ్యాపారి తన స్కూటర్‌పై అక్కడికి వచ్చి కచోరీ తినేందుకు ఆగాడు. రూ 20 లక్షల నగదు ఉన్న బ్యాగును స్కూటర్ ముందు ఉంచాడు. అదే సమయంలో మరో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి పక్కన ఆగారు. వెనుక కూర్చున్న వ్యక్తి వేగంగా నగదు బ్యాగును తీసుకుని తన సహచరుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ పరిణామం క్షణాల్లో జరిగిపోయింది (Rs.20 lakh theft Jaipur).


బ్యాగును ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించిన చంపాలాల్ వెంటనే దొంగల వెంట పరుగులు తీశాడు (CCTV robbery video). స్థానికులు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నిందితులు స్కూటర్‌పై వేగంగా వెళ్లిపోవడంతో వారిని పట్టుకోలేకపోయారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు హెల్మెట్లు ధరించి ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు


అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..

Updated Date - Oct 27 , 2026 | 06:20 PM