Share News

మార్నింగ్‌ వాక్‌ చేస్తూ కిందపడిపోయిన ధన్‌ఖడ్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:40 AM

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

మార్నింగ్‌ వాక్‌ చేస్తూ కిందపడిపోయిన ధన్‌ఖడ్‌
dhankhad

మార్నింగ్‌ వాక్‌ చేస్తూ కిందపడిపోయిన ధన్‌ఖడ్‌

న్యూఢిల్లీ, నవంబరు 11: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఆయన కుప్పకూలి స్పృహ కోల్పోయారు. దీంతో ఆయన్ను ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ వైద్య వర్గాలు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. గతంలోనూ ఆయన అనేకమార్లు కిందపడిపోయి కోమాలోకి వెళ్లారు. 75 సంవత్సరాల ధన్‌ఖడ్‌ 2022 ఆగస్టు నుంచి 2025 జూలై 21న రాజీనామా చేసే వరకు దేశ 14వ ఉప రాష్ట్రపతిగా కొనసాగారు. రిటైరయ్యాక ఇంకా అధికారిక నివాసం కేటాయించకపోవడంతో హర్యానా నేత అభయ్‌ చౌతాలకు చెందిన ఢిల్లీ ఫామ్‌హౌస్‌లో ధన్‌ఖడ్‌ ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి..

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు.

Updated Date - Nov 12 , 2026 | 01:48 AM