పూరీ జగన్నాథుడికి మెడికల్ టెస్ట్‌లు
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:00 AM
పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామివారికి వైద్య పరీక్షలు నిర్వహించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. స్నాన పౌర్ణిమ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలకు...
పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామివారికి వైద్య పరీక్షలు నిర్వహించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. స్నాన పౌర్ణిమ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలకు 108 కలశాల పవిత్ర జలంతో రాజస్నానం(అభిషేకం) చేయిస్తారు. దీనివల్ల దేవతలకు జ్వరం వచ్చినట్లు భావిస్తారు. దీంతో 15 రోజుల పాటు కొనసాగే ‘‘అనసార’’ కాలంలో భక్తులకు దర్శనం ఉండదు. ఈ సమయంలో రాజవైద్యులు ఆయుర్వేద ఔషధాలు, పథ్యాహారం సమర్పిస్తూ ప్రతీకాత్మక వైద్య సేవలు నిర్వహిస్తారు. 15 రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుంటారని, జగన్నాథుడు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించిన తర్వాతే, స్వామివారు ‘నవజౌవన రూపం’లో భక్తులకు దర్శనమిస్తారు. ఆపై ఘనంగా జరిగే రథ యాత్రకు సిద్ధమవుతారు. అయితే, ఈ తతంగం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని జగన్నాథ ఆలయాల్లో జరుగుతుంది. ఒడిశాలోని ప్రధాన పూరీ ఆలయంలో కూడా ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. కానీ, ఆధునిక వైద్యులు స్టెతస్కో్‌పలతో నిజమైన రోగిని పరీక్షించినట్లు దేవుడి విగ్రహాన్ని పరీక్షించే ఈ వినూత్నమైన ఘట్టం మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ప్రసిద్ధి చెందింది.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు