ఈ ఏడాది ఏడు ప్రయోగాలు లక్ష్యం
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:02 AM
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ చెప్పారు...
రెండు నెలల్లో తదుపరి ప్రయోగం
విక్రమ్-1 విజయం ఓ మైలురాయి: ఇస్రో చైర్మన్
సూళ్లూరుపేట, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ చెప్పారు. తదుపరి ప్రయోగం రెండు నెలల్లోనే ఉంటుందని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ప్రయోగ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్రోకు చెందిన రెండు ఉపగ్రహాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదారు అనుసంధాన దశలో ఉన్నాయని పేర్కొన్నారు. విక్రమ్-1 ప్రయోగం ఓ మైలురాయిగా అభివర్ణించారు. తొలి ప్రయత్నంలో విజయం సాధించిన యువ బృందానికి అభినందనలు తెలిపారు. దేశీయ అంతరిక్ష రంగంలో ఈ విజయం ‘భారత్-2047’ విజన్‌కు ఎంతో దోహదం చేస్తుందన్నారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకులు ఇద్దరూ ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు కావడాన్ని ప్రస్తావిస్తూ, పిల్లలు విజయం సాధిస్తే తల్లిదండ్రులు ఎలాంటి సంతోషపడతారో తమకు కూడా అలానే ఉందన్నారు. స్టార్టప్ కంపెనీలను, ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తూ 2020లో అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!