పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ విజయవంతం
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:49 AM
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌కు కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్-డ్రాప్...
గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు
న్యూఢిల్లీ, జూలై 8: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌కు కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్-డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ-05)ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఉన్న ఏరియల్ డెలివరీ రిసెర్చ్, డెవల్‌పమెంట్ ఎస్టాబ్లి్‌షమెంట్(ఏడీఆర్‌డీఈ) డ్రాప్ జోన్‌లో మంగళవారం ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76 విమానం నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 2.5 టన్నుల బరువున్న క్రూమాడ్యూల్‌ను పోలిన నమూనాను 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందకు జారవిడిచారు. అనంతరం దీనిలోని రెండు పారాచూట్లు నిర్దేశిత సమయానికి తెరుచుకుని క్రూమాడ్యూల్‌ను సురక్షితంగా భూమిపైకి చేర్చాయి. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా క్రూమాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను క్షేమంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు ఈ పారాచూట్లు దోహదపడతాయి.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్