భోజ్‌శాల ఆలయ కేసులో ఇండోర్ కోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - May 15 , 2026 | 04:07 PM
భోజ్‌శాల ఆలయ కేసులో ఇండోర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలం ఆలయానిదేనంటూ ఇండోర్ ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది.
మధ్యప్రదేశ్ మే15: భోజ్‌శాల ఆలయ కేసులో ఇండోర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలం ఆలయానిదేనంటూ ఇండోర్ ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఆలయంలో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
భోజ్‌శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. భోజ్‌శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందూవులు వాగ్దేవి (సరస్వతి) దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. అక్కడ 2003 ఏఎస్ఐ ఒప్పందం ప్రకారం, హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు కొనసాగిస్తున్నారు.
అయితే ఈ ప్రదేశంలో ఆరాధన కోసం ప్రత్యేక హక్కులు కోరుతూ హిందూ వర్గం ఈ ఒప్పందాన్ని హైకోర్టులో సవాలు చేసింది. ఆలయ స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాలు వాదించాయి. 2024లో 98 రోజులపాటు పురావస్తుశాఖ సర్వే నిర్వహించింది. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ బెంచ్ నేడు విచారణ జరిపింది. 2024 జులై 15న ఇండోర్ కోర్టుకు నివేదిక సమర్పించింది. మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు
పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి