Share News

ఖరీఫ్‌ ఉత్పత్తుల్లో 3.6శాతం క్షీణత!

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:45 AM

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటల దిగుబడులు క్షీణించనున్నాయి

ఖరీఫ్‌ ఉత్పత్తుల్లో 3.6శాతం క్షీణత!
paddy

  • 167 మిలియన్‌ టన్నులకు పడిపోతుందని అంచనా

న్యూఢిల్లీ, నవంబరు 27: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటల దిగుబడులు క్షీణించనున్నాయి. 2026-27లో దేశ ఖరీఫ్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.6 శాతం తగ్గి, 167.14 మిలియన్‌ టన్నుల(ఎంటీ)కు పడిపోతుందని అంచనా. ఇది 2025-26కు సంబంధించి విడుదల చేసిన తొలి ముందస్తు అంచనా 173.33 ఎంటీ కంటే తక్కువ. అలాగే మార్చిలో విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాలో పేర్కొన్న 174.14 ఎంటీ కంటే కూడా 7 ఎంటీ (4శాతం) తక్కువగా ఉంది. ఎల్‌నినో, రుతుపవనాల మందగమనం, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు వర్షాలు లేకపోవడం అలాగే సీజన్‌ ప్రారంభంలో వర్షపాతం లోటు వంటి పరిస్థితుల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ గత ఐదేళ్ల సగటు ఖరీఫ్‌ ఉత్పత్తి కంటే ఇది 9.77 ఎంటీ ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన తొలి ముందస్తు అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విడుదల చేశారు.

ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 05:45 AM