సుంకాల రద్దు తీర్పు వెనుక ఇద్దరు భారత సంతతి న్యాయవాదులు
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:31 AM
ట్రంప్ సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించడం వెనుక భారత సంతతికి చెందిన ఇద్దరు న్యాయవాదులు నీల్ కుమార్ కత్యాల్, దీపక్ గుప్తా కీలకపాత్ర...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ట్రంప్ సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించడం వెనుక భారత సంతతికి చెందిన ఇద్దరు న్యాయవాదులు నీల్ కుమార్ కత్యాల్, దీపక్ గుప్తా కీలకపాత్ర పోషించారు. ట్రంప్ యంత్రాంగం టారి్‌ఫలకు వ్యతిరేకంగా కత్యాల్, దీపక్ గుప్తా సుప్రీంకోర్టులో వాదించారు. ట్రంప్ టారి్‌ఫలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన వ్యాపారులు, డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల తరఫున సుప్రీంకోర్టులో నీల్ కత్యాల్ వాదనలు వినిపించారు. ప్రధానంగా 1977 నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఐఈపీఏ)ను ఆధారంగా చేసుకొని ట్రంప్ సుంకాలను విధించడాన్ని కత్యాల్ తన వాదనల్లో గట్టిగా వ్యతిరేకించారు. ప్రతి వాణిజ్య భాగస్వామిపైనా సుంకాలు విధించడం రాజ్యాంగ విరుద్ధం అని వాదించారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఓ మైలురాయిగా కత్యాల్ అభివర్ణించారు. అధ్యక్షుడు శక్తిమంతుడే అయినా రాజ్యాంగం అంతకుమించి శక్తిమంతమైనదని.. చట్టపరమైన పాలనకు సుప్రీంకోర్టు దన్నుగా నిలబడింది అని పేర్కొన్నారు న్యాయవాదిగా కెరీర్ తొలినాళ్లలో కత్యాల్ అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టిఫెన్ బ్రేయర్ వద్ద కత్యాల్ క్లర్కుగా పనిచేశారు. కాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ట్రంప్ యంత్రాంగం టారి్‌ఫలు విధించిందని దీపక్ గుప్తా వాదించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News