45 పైసలకే రూ.10 లక్షల రైల్వే ప్రయాణ బీమా
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:32 AM
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 26: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఐచ్ఛిక ప్రయాణ బీమా పథకాన్ని(ఓటీఐఎస్) ఇకపై రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసేవారికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈనెల 27 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అన్ని జోనల్ రైల్వేలకు రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో ప్రయాణికుడు కేవలం 45 పైసల ప్రీమియం చెల్లించి రూ. 10 లక్షల వరకు బీమా రక్షణ పొందవచ్చు. రైలు ప్రమాదం లేదా ఇతర అవాంఛనీయ సంఘటనల వల్ల మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఈ బీమా వర్తిస్తుంది
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్