Share News

అశోక్‌సేన్‌కు ‘ఆస్కార్‌ క్లెయిన్‌’ అవార్డు

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:16 AM

భారత భౌతిక శాస్త్రవేత్త అశోక్‌ సేన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

అశోక్‌సేన్‌కు   ‘ఆస్కార్‌ క్లెయిన్‌’ అవార్డు
ashok

న్యూఢిల్లీ/బెంగళూరు, అక్టోబరు 24: భారత భౌతిక శాస్త్రవేత్త అశోక్‌ సేన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. భౌతిక శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు అందించే ప్రతిష్టాత్మక ‘ఆస్కార్‌ క్లెయిన్‌ మెడల్‌’ పురస్కారం 2026 సంవత్సరానికి గానూ ఆయన్ను వరించింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్తగా అశోక్‌సేన్‌ నిలిచారు. ప్రస్తుతం ఆయన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెండల్‌ రిసెర్చ్‌ (టీఐఎ్‌ఫఆర్‌)లో భాగమైన బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థీరియాటికల్‌ సైన్సెస్‌ (ఐసీటీఎ్‌స)లో ఐసీటీఎ్‌స-ఇన్ఫోసిస్‌ మాధవ చైర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అశోక్‌ సేన్‌ ఆధునిక సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో కీలకమైన పరిశోధనలు చేశారు. ఆధునిక స్ట్రింగ్‌ సిద్ధాంత రూపకర్తగా పేరుపొందారు. పదార్థంలోని ప్రాథమిక అంశాలు బిందు కణాల రూపంలో కాకుండా, అతి సూక్ష్మమైన ఏక మితి (వన్‌ డైమెన్షనల్‌), దారం (స్ట్రింగ్‌) వంటి నిర్మాణాలుగా ఉంటాయని ఈ థియరీ చెబుతోంది. స్వీడిష్‌ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆస్కార్‌ క్లెయిన్‌ పేరుతో ఈ అవార్డును 1988లో ప్రారంభించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోం యూనివర్సిటీ, రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ భౌతిక శాస్త్ర నోబెల్‌ కమిటీ సంయుక్తంగా ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 05:17 AM