ఎన్విడియా సీఈవోను మార్చాల్సి వస్తే..
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:19 AM
చైనా గూఢచారి అలిస్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఎన్విడియా సీఈవో బాధ్యతల నుంచి జెన్సన్ వైదొలగాల్సి వస్తే ఆ పదవిని చేపట్టే అవకాశాలున్న వారిలో భారతీయుడైన జయ్ పురి పేరు కూడా అంతర్జాతీయ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
రేసులో భారతీయుడు జయ్ పురి పేరు
పదవిని ఆయన చేపట్టే అవకాశం ఉందంటూ చర్చ
జాబితాలో కొలెట్ క్రెస్, ఇయాన్ బక్ పేర్లు కూడా
న్యూఢిల్లీ, నవంబరు 11: చైనా గూఢచారి అలిస్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఎన్విడియా సీఈవో బాధ్యతల నుంచి జెన్సన్ వైదొలగాల్సి వస్తే ఆ పదవిని చేపట్టే అవకాశాలున్న వారిలో భారతీయుడైన జయ్ పురి పేరు కూడా అంతర్జాతీయ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. జయ్ పురి ఎన్విడియా సేల్స్ విభాగం మాజీ చీఫ్. 2009లో కంపెనీ వరల్డ్‌వైడ్ ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. కంపెనీ సేల్స్, బిజినెస్ డెవల్‌పమెంట్, కస్టమర్ రిలేషన్స్‌లో ఆయనకు విశేష అనుభవం ఉంది. 2026 ఆగస్టులో ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కంపెనీకి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. ఇక చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు కొలెట్ క్రెస్. ఆమె ప్రస్తుతం కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2013లో కంపెనీలో చేరారు. కంపెనీ ఏఐ వ్యాపార విస్తరణ ఆమె పర్యవేక్షణలోనే జరిగింది. వీరితో పాటు ఇయాన్ బక్, బ్రయాన్ కాటన్జారోల పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇదిలా ఉండగా, జెన్సన్-అలిస్‌ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఆయన కుటుంబానికి ముందే తెలుసన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2025 మే నెలలో తైవాన్ రాజధాని తైపీలో ఓ రెస్టారెంట్‌లో జెన్సన్, అలిస్, ఆయన కుటుంబసభ్యులు కలిసి ఉన్న ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జెన్సన్‌ను అలిస్ ముద్దు పెట్టుకుంటుండగా ఆయన కుమార్తె మాడిసన్ సరదాగా తన ఫోన్‌లో ఫొటోలు తీసినట్లు ఉంది.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు