Share News

అమెరికాలో భారత సంతతి టెకీ షీతల్‌ హత్య

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:50 AM

అమెరికాలోని జార్జియాలో భారత సంతతి ప్రముఖ టెకీ, గూగుల్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న...

అమెరికాలో భారత సంతతి టెకీ షీతల్‌ హత్య

  • ఇంట్లోనే కాల్చి చంపిన భర్త కిర్క్‌

న్యూఢిల్లీ, జూలై 11: అమెరికాలోని జార్జియాలో భారత సంతతి ప్రముఖ టెకీ, గూగుల్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న షీతల్‌(57) దారుణ హత్యకు గురయ్యారు. కాబ్‌ కౌంటీలోని లారెల్‌ గ్రీక్‌ ట్రెయిల్‌లో ఉన్న తన ఇంట్లోనే షీతల్‌ను ఆమె భర్త కిర్క్‌ బీ విర్జీషియెన్‌ గత మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తుపాకీతో కాల్చి చంపాడు. కిర్క్‌ కాల్పుల్లో వారి కుమారుడు జేసన్‌ (23) తీవ్రంగా గాయపడ్డాడు. కిర్క్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షీతల్‌ భారత్‌, ఇంగ్లాండ్‌, ఘనా దేశాల్లో పెరిగారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి 1994లో జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఆమెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. గత 20 ఏళ్లుగా గూగుల్‌ సంస్థలో నాయకత్వ హోదాలో ఉన్నారు. షీతల్‌ పేరుతో రెండు సాఫ్ట్‌వేర్‌ పేటెంట్లు కూడా ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Jul 12 , 2026 | 05:50 AM