ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. వీడియోలు విడుదల చేసిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్..
ABN , Publish Date - May 07 , 2026 | 01:07 PM
ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి.
న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి. ‘భారతదేశం చాలా పక్కాగా, ప్లాన్ ప్రకారం జవాబు ఇచ్చింది. దేశ గౌరవాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది’ అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ‘న్యాయం గెలిచింది. పక్కా ప్లాన్‌తో గట్టిగా జవాబు ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇండియా దేన్నీ మర్చిపోదు.. ఎవరినీ క్షమించదు’అని ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది.
స్థిరమైన సంకల్పంతో ఉన్నాం: మోదీ
ఆపరేషన్ సిందూర్ విజయంతం అవడానికి ఎంతగానో కృషి చేసిన సాయుధ దళాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఏడాది క్రితం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సాయుధ దళాలు అసమానమైన ధైర్యసాహసాలను ప్రదర్శించాయని పేర్కొన్నారు. పహల్గామ్‌లో అమాయక భారతీయులపై దాడికి తెగబడ్డ వారికి తగిన విధంగా సమాధానం చెప్పాయని అన్నారు. భారత సాయుధ దళాల పరాక్రమానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోందన్నారు. సంవత్సరం తర్వాత కూడా.. ఉగ్రవాదాన్ని ఓడించడానికి, దానికి ఊతమిచ్చే వ్యవస్థను నిర్మూలించడానికి తాము అంతే స్థిరమైన సంకల్పంతో ఉన్నామని తేల్చి చెప్పారు.
ఏడాది క్రితం ఇదే రోజు..
ఏప్రిల్ 22వ తేదీన జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది భారతీయులను పొట్టనపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ను మొదలుపెట్టింది. మే 7వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి.100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయారు.
ఇవి కూడా చదవండి
2,000 కి.మీ దూరం ప్రయాణించిన పావురం
బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ హతం..