భారత సైన్యానికి 2వేల ‘ప్రహార్’ లైట్ మెషిన్ గన్స్
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:28 AM
భారత సైన్యం పోరాట సామర్థ్యానికి మరింత బలం చేకూరింది. శనివారం మొదటి బ్యాచ్ కింద 2వేల ‘ప్రహార్’ తేలికపాటి మెషిన్ గన్స్...
మొదటి బ్యాచ్‌ను డెలివరీ చేసిన అదానీ డిఫెన్స్
గ్వాలియర్, మార్చి 28: భారత సైన్యం పోరాట సామర్థ్యానికి మరింత బలం చేకూరింది. శనివారం మొదటి బ్యాచ్ కింద 2వేల ‘ప్రహార్’ తేలికపాటి మెషిన్ గన్స్ (ఎల్‌ఎంజీ) ఆర్మీ చేతికి అందాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఇవి తయారుకావడం విశేషం. 7.62 ఎంఎం క్యాలిబర్ కలిగిన ఈ ఆయుధాలను గ్వాలియర్ శివారులో ఉన్న తన స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తయారు చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఎల్‌ఎంజీలను ఆర్మీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ డీజీ అక్విజిషన్ ఎ.అన్బరసు, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈవో అశిష్ రాజవన్షీ, సంస్థకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా దాదాపు 40వేల లైట్ మెషిన్ గన్స్‌కు ఆర్డరు ఉన్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు
అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు
Read Latest AP News And Telugu News