Share News

పాక్ కోసం గూఢచర్యం.. ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అరెస్టు

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:51 AM

పాక్‌ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాక్ కోసం గూఢచర్యం.. ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అరెస్టు
IAF Wing Commander Arrested Over Espionage

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం మే నెలలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం వెనుక భారీ గూఢచర్య నెట్‌వర్క్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ నిఘా ఆఫీసర్లు పన్నిన హనీట్రాప్‌లో వింగ్ కమాండర్ పడ్డాడని చెప్పాయి. నిందితుడిపై అప్పటికే కొంతకాలంగా నిఘా పెట్టి ఆపై పోలీసులకు సమాచారం అందించామని ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి తెలిపారు.


వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వింగ్ కమాండర్ హనీట్రాప్‌లో పడ్డట్టు పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఒక మహిళ అతడి పరిస్థితిని ఆసరాగా చేసుకుని గుఢచర్యానికి ఉసిగొల్పింది. ‘చాటింగ్‌తో వాళ్ల పరిచయం మొదలైంది. ఆ తరువాత వీడియో కాల్స్ చేసుకున్నారు. అతడికి నమ్మకం కలిగించాక ఆమె మిలిటరీ కదలికల సమాచారం, ఫొటోలను కోరింది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళ కోరిక మేరకు కీలకమైన సమాచారం, డాక్యుమెంట్స్‌ను వింగ్ కమాండర్ డిజిటల్ మాధ్యమాల ద్వారా షేర్ చేశాడు. ఆ తరువాత ఆమె సూచనలతో అతడు తన సహోద్యోగి ఫోన్‌లో స్పైవేర్ కూడా ఇన్‌స్టాల్ చేశాడు. రిమోట్‌గా డివైజ్‌లోని సమాచారాన్ని తస్కరించేందుకు, లోకేషన్ డేటాను తెలుసుకునేందుకు, ఫోన్ కాల్స్‌ను వినేలా స్పైవేర్‌ను డిజైన్ చేశారు.


పాక్‌లోని హ్యాండ్లర్ల సూచనల ప్రకారం మహిళ ఆ వింగ్ కమాండర్‌ను ఉచ్చులోకి దింపినట్టు గుర్తించారు. ఇక శత్రుమూకలకు చేరిన సమాచారంతో ముప్పు ఎంత ఉందనేది విశ్లేషిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ రంగానికి చెందిన సీక్రెట్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉద్దేశించిన పాక్ నిఘా నెట్‌వర్క్‌లో మహిళ భాగమైన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు మార్గనిర్దేశనం చేస్తున్న విదేశీ హ్యాండర్లు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలనూ చదవండి:

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి

చైనాకు కౌంటర్ ఇచ్చిన భారత్.. స్పష్టమైన మ్యాప్ విడుదల

Updated Date - Aug 08 , 2026 | 12:15 PM