పొగాకు వినియోగంలో భారత్ టాప్!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:03 AM
ఖైనీ, గుట్కా, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉందని ఓ తాజా పరిశోధనలో తేలింది.
90 శాతం మరణాలు 10 దేశాల్లోనే.. దిలాన్సెట్ నివేదిక
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఖైనీ, గుట్కా, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉందని ఓ తాజా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి దాదాపు 24.1కోట్ల మంది ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసలయ్యారని, ముఖ్యంగా 60 నుంచి 64ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో ఈ అలవాటు ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. పొగాకు నమలడం వల్ల సంభవించే మరణాల్లో 90ు.. భారత్ సహా 10 దేశాల్లోనే ఉన్నట్లు ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్’ నివేదిక పేర్కొంది. 2023లో నమిలే పొగాకు వల్ల 2.51లక్షల మంది చనిపోగా, ఒక్క దక్షిణాసియా ప్రాంతంలోనే 2.10 లక్షల(84ు) మంది ప్రాణాలు కోల్పోయారు. పొగాకు నియంత్రణకు దశాబ్దాలుగా ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ, పెద్దగా మార్పు రాలేదని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల ప్రధానంగా క్యాన్సర్లు, గుండెజబ్బులు రావడంతో పాటు పక్షవాతం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు