Share News

రష్యా సహకారంతో దేశంలోనే విమాన తయారీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:04 AM

భారత్‌లో విమాన తయారీ దిశగా రష్యాతో చర్చలను విస్తృతం చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు..

రష్యా సహకారంతో దేశంలోనే విమాన తయారీ

  • చర్చలను విస్తృతం చేశాం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: భారత్‌లో విమాన తయారీ దిశగా రష్యాతో చర్చలను విస్తృతం చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. రష్యా ప్రతినిధి బృందంతో భేటీ అనంతరం గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో విమాన తయారీపై రష్యాతో ప్రభుత్వరంగ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవడం తెలిసిందే. టర్బోప్రాప్‌ ఐఎల్‌-114, సుఖోయ్‌ సూపర్‌జెట్‌ -100 విమానాలు. భారత్‌లో ప్రాంతీయ అనుంసధానత పథకానికి చక్కగా సరిపోతాయి. ఎన్నో ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. వాటిని అనుసంధానించడం ఎంతో ముఖ్యం. సాధ్యమైనంత త్వరగా దేశంలోనే ఈ విమానాలను తయారు చేయడంపై దృష్టి సారించాం’’అని ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 11 , 2026 | 06:04 AM