2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:52 AM
భారత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికల్లా ఏర్పాటు చేస్తామని ప్రధా ని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్ వేదికగా...
2040కల్లా భారతీయుడిని చంద్రుడిపైకి పంపుతాం
అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ప్రధాని మోదీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: భారత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికల్లా ఏర్పాటు చేస్తామని ప్రధా ని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్ వేదికగా గురువారం జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఆదిత్య ఎల్1తో సూర్యుడి రహస్యాలు తెలిశాయన్నారు. గత ఏడాది ఓ భారతీయుడు అంతరిక్ష కేంద్రంలో ఉండి వచ్చారని గుర్తుచేశారు. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ ప్రయోగాల ద్వారా లభించే ప్రయోజనాలు సర్వ మానవాళికి అందించాలన్నదే తమ ఆశయమన్నారు. ఇస్రోతో పాటు దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 1960లో భారత అంతరిక్ష కార్యక్రమాలు ప్రారంభమైననాటి నుంచి ఫ్రాన్స్ ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉందన్నారు. ప్రస్తుతం ఇరు దే శాల సహకారం ఆధునిక టెక్నాలజీల మొదలు శాస్త్రీ య నైపుణ్యాన్ని మానవ అవసరాలకు వినియోగించడం వరకు కొనసాగుతోందని చెప్పారు. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు భారత్‌తో పాటు కలిసి సాగడానికి ప్రపంచదేశాలను ఆయన ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..