Share News

నౌకాదళానికి 6 అత్యాధునిక జలాంతర్గాములు

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:11 AM

నౌకాదళం కోసం జర్మనీ సహకారంతో రూ.70వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆరు అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ 75(ఐ) ఒప్పందం ఎట్టకేలకు...

నౌకాదళానికి 6 అత్యాధునిక జలాంతర్గాములు

  • రూ.70వేల కోట్ల వ్యయం.. జర్మనీ

  • సహకారంతో దేశీయంగా తయారీ

  • సీసీఎస్‌ ముందుకు ప్రతిపాదన

  • నౌకాదళానికి 6 అత్యాధునిక జలాంతర్గాములు

న్యూఢిల్లీ, ఆగస్టు 16: నౌకాదళం కోసం జర్మనీ సహకారంతో రూ.70వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆరు అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ 75(ఐ) ఒప్పందం ఎట్టకేలకు ముందుకు కదలనుంది. ఈ ప్రతిపాదన త్వరలోనే క్యాబినెట్‌ భద్రతా వ్యవహారాల కమిటీ (సీసీఎస్‌) ముందుకు రానుంది. ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌), జర్మనీకి చెందిన థైసెన్‌క్రూప్‌ మెరైన్‌ సిస్టమ్స్‌(టీఎంకేఎస్‌) భాగస్వామ్యంతో ఈ జలాంతర్గాములను భారత్‌లోనే నిర్మించనున్నారు. ఈ ఒప్పందం సంవత్సరాల తరబడి చర్చల దశలోనే ఉంది. సీసీఎస్‌ ఆమోదం లభిస్తే ఒప్పందంపై సంతకం చేయడానికి, పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం కానుంది. కాగా, ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌(ఏఐపీ) సాంకేతికతతో నిర్మించే ఈ జలాంతర్గాములకు నీటి అడుగున ఎక్కువ కాలం ఉండటంతో పాటు శత్రువులకు ఆచూకీ దొరక్కుండా సంచరించే సామర్థ్యం ఉంటుంది.

వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 17 , 2026 | 06:11 AM