Share News

180 రోజుల్లోపు ఇకపై రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:51 AM

దేశంలో 180 రోజులకు మించి ఉండాలనుకునే విదేశీ పౌరులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ మేరకు గడువు దాటిన తర్వాత కాకుండా వారు ముందే(...

180 రోజుల్లోపు ఇకపై రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

  • భారత్‌లో బసపై విదేశీయులనిబంధనల సవరణ

న్యూఢిల్లీ, జూన్‌ 2: దేశంలో 180 రోజులకు మించి ఉండాలనుకునే విదేశీ పౌరులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ మేరకు గడువు దాటిన తర్వాత కాకుండా వారు ముందే(180 రోజుల్లోపే) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు 180 రోజుల గడువు దాటాక 14 రోజుల్లోపు నమోదు చేసుకోవాల్సి ఉండేది. అలాగే 180 రోజుల కంటే ఎక్కువ కాలం వీసా ఉన్నప్పటికీ.. ‘ప్రతి విజిట్‌లో ఇంతకాలం కంటే ఎక్కువ ఉండకూడదు’ అనే నిబంధన ఉన్నట్లయితే వారు కూడా 180 రోజుల్లోపే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇకపై ఈ నిర్దేశిత గడువు (180 రోజులు) దాటిన తర్వాత రిజిస్ట్రేషన్‌కు అత్యవసర లేదా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ మేరకు ఇమిగ్రేషన్‌, విదేశీయుల నియమాల (2025) చట్టానికి సవరణలు చేశారు. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ విదేశీయులై ఉండి ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే.. వారికి సంబంధించిన నిబంధనలు కూడా మారాయి. తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉంటే ఇక్కడ పుట్టిన బిడ్డకు భారత పౌరసత్వాన్ని కొనసాగించాలనుకుంటే 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. అలాగే ఆ బిడ్డకు విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే.. ఆ మార్పు జరిగిన 30 రోజుల్లోపు తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా సంబంధిత రిజిస్ట్రేషన్‌ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 05:51 AM