Share News

ఇరాన్ యుద్ధం.. 25 శాతం పడిపోయిన ఎరువుల ఉత్పత్తి..

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:00 PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారతదేశంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం కనబడుతోంది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.

ఇరాన్ యుద్ధం.. 25 శాతం పడిపోయిన ఎరువుల ఉత్పత్తి..
India fertiliser output

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారతదేశంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కనబడుతోంది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం మార్చిలో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి 24.6 శాతం పడిపోయిందని కేంద్రం వెల్లడించింది (India fertiliser output).


పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సహజ వాయువుల దిగుమతులు జరగలేదు. ఎరువుల తయారీలో కీలకమైన సహజ వాయువుల సరఫరాలో ఆటంకాల వల్ల ఆ మేరకు ఉత్పత్తి తగ్గిపోయింది. మన దేశంలో వ్యవసాయానికి ఎరువులు చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూరియాపై రైతులు ఎక్కువగా ఆధారపడతారు. కాగా, ఎరువుల ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రస్తుతానికి అవసరమైనంత మేర అందుబాటులో ఉన్నాయని కేంద్రం పేర్కొంది (Fertiliser production drop India).


ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూన్-జులై నెలల్లో ఎరువుల డిమాండ్ అధికంగా ఉంటుంది (Urea production India). ఇక, రబీ సీజన్‌కు సంబంధించి అక్టోబర్-నవంబర్‌లో మళ్లీ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్‌కు తగ్గినట్టుగా ఎరువులను దేశీయంగానే ఉత్పత్తి చేస్తారు. అయితే ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్


భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 21 , 2026 | 08:00 PM