2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు..
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:18 PM
దేశంలో నగర వైమానిక రవాణా రంగంలో ఒక సరికొత్త శకానికి తెరలేవబోతోంది. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
బెంగళూరు, ఆగస్టు 8: 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని, ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై పరీక్షలు వచ్చే ఏడాది వేగవంతం కానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానాలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి రద్దీగా ఉండే మహానగరాలకు కొత్త రవాణా మార్గాన్ని అందించగలవని అన్నారు. బెంగళూరులోనే కాకుండా, ముంబై, ఢిల్లీలలో కూడా వీటికి చాలా అవసరం ఉందని ఆయన చెప్పారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) సాంకేతికత ద్వారా బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య భారీగా తగ్గుతుందని మంత్రి తెలిపారు. గంటన్నర నుంచి రెండు గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 20 నుంచి 30 నిమిషాలకు తగ్గుతుందని స్పష్టం చేశారు.
'సర్లా ఏవియేషన్' కంపెనీకి డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్ (DOA)ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మంజూరు చేసిందని, నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వచ్చే ఏడాది పూర్తిస్థాయి టెస్టింగ్ ఫేజ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఎయిర్ ట్యాక్సీ ప్రత్యేకతలు:
ఇది పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు.
ఇందులో మొత్తం 7 ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి (6 టేకాఫ్ కోసం, 1 ముందుకు వెళ్లేందుకు)
ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ ఆధారిత విమానం అయినప్పటికీ, అవసరమైతే గాల్లోనే బ్యాటరీ ఛార్జ్ చేసుకునేలా టర్బో-జెనరేటర్ అమర్చే వెసులుబాటు కూడా దీని డిజైన్‌లో ఉంది.
స్వదేశీ తయారీ – తక్కువ ధర: విమానయాన పరికరాలు (అవియోనిక్స్) మినహా మిగిలిన విడిభాగాలన్నీ భారత్‌లోనే తయారు కానున్నందున ప్రయాణ ధరలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.
భారీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు: Accel, నిఖిల్ కామత్ (జెరోధా), బిన్నీ బన్సాల్ (ఫ్లిప్‌కార్ట్) వంటి దిగ్గజాల మద్దతు ఉన్న ఈ స్టార్టప్‌తో ఇప్పటికే బెంగళూరు ఎయిర్‌పోర్ట్ శంషాబాద్/లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం, మణిపాల్ హాస్పిటల్స్ ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే నగర ప్రయాణాలే కాకుండా ఎయిర్ అంబులెన్స్, అత్యవసర వైద్య రవాణా, కార్గో సేవల రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించడమే కాక విదేశాలకు కూడా eVTOL విమానాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ