Share News

దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి ఇక రెట్టింపు

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:44 AM

పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని..

దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి ఇక రెట్టింపు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 16: పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 21 ఆయిల్‌ రిఫైనరీ కంపెనీలు, చమురు/గ్యాస్‌ ఉత్పత్తి సంస్థలకు ఎల్‌పీజీ ఉత్పత్తి పరంగా మొదటిసారి లక్ష్యాలను విధించింది. ఇకపై అవి రోజువారీ 63,180 టన్నులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు రోజువారీ ఉత్పత్తితో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం. తద్వారా దేశీయ అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని స్థానికంగానే సమకూర్చుకోవాలన్నది కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. తాజా ఉత్పత్తి పెంపులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కీలక పాత్ర పోషించనుంది. 18,000 టన్నుల మేర లక్ష్యాన్ని రిలయన్స్‌కు కేంద్రం విధించింది. ప్రైవేటు రంగంలోని మరో రిఫైనరీ నయారాకు 4,480 టన్నుల లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ ఆయిల్‌ రిఫైనరీలు 31,470 టన్నుల ఎల్‌పీజీని పెట్రోల్‌ శుద్ధి ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 17 , 2026 | 06:44 AM