రష్యా నుంచి అధిక ధరలకు.. 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసిన భారత్..
ABN , Publish Date - Mar 25 , 2026 | 07:20 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తోంది. తాజాగా రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు 'బ్లూమ్‌బర్గ్' తన కథనంలో పేర్కొంది (India Russian oil).
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లోని బ్రెంట్ క్రూడాయిల్ ధర కంటే, బ్యారెల్‌కు 5-15 డాలర్లు అధికంగా చెల్లించి మరీ భారత రిఫైనరీలు ఈ కొనుగోళ్లు జరిపినట్టు సమాచారం. ఫిబ్రవరిలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుతో పోల్చుకుంటే ఈ కొనుగోళ్లు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసి ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో.. రష్యా క్రూడాయిల్‌పై అమెరికా ఆంక్షలు సడలించింది. దీంతోనే భారత్ రిఫైనరీలు ఇంత భారీ స్థాయిలో కొనుగోళ్లు జరిపాయి
హోర్ముజ్ జలసంధి దగ్గర నౌకల ప్రయాణానికి అంతరాయం కొనసాగినంత కాలం రష్యా ముడి చమురుపై ఆంక్షల సడలింపును అమెరికా పొడిగించే అవకాశం కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురుపై కూడా ఆమెరికా ఆంక్షలు ఎత్తేసింది. ఆ చమురును కూడా భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..
పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..