Share News

విదేశాలకు పారిపోయిన నేరస్థులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం

ABN , Publish Date - Aug 04 , 2026 | 05:26 PM

విదేశాలకు పారిపోయిన నేరస్థులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2019 నుంచి 2026 మధ్య కాలంలో 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

విదేశాలకు పారిపోయిన నేరస్థులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం
India Brings Back 274 Fugitives from 36 Countries Since 2019, Says MHA

ఢిల్లీ, ఆగస్టు 4: విదేశాలకు పారిపోయిన నేరస్థులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2019 నుంచి 2026 మధ్య కాలంలో 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(MHA) మంగళవారం వెల్లడించింది. వీరిలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, ఆర్థిక, మత్తుపదార్థాల(నార్కోటిక్స్) నేరస్థులతో పాటు హత్య, అత్యాచారం, పోక్సో(POCSO) చట్టం కింద కేసులు నమోదైన నిందితులు ఉన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో సమగ్రమైన, సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థ ద్వారా ఈ విజయాన్ని సాధించినట్లు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.


భారీగా ఆస్తుల జప్తు, నిధుల రికవరీ

నేరస్థులను రప్పించడమే కాకుండా, వారి అక్రమ ఆస్తులపై కూడా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. పీఎంఎల్ఏ(PMLA) చట్టం ద్వారా 2019-26 మధ్యకాలంలో పరారీలో ఉన్న నేరస్థులకు చెందిన రూ. 17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వారి కేసులకు సంబంధించి రూ.18,762 కోట్లను తిరిగి రాబట్టారు.

విదేశాల్లో దాక్కున్న నేరస్థుల వేటలో భాగంగా ఇంటర్‌పోల్ ద్వారా జారీ చేసే రెడ్ కార్నర్ నోటీసుల సంఖ్యను భారత్ గణనీయంగా పెంచింది. గడిచిన మూడేళ్లలో 501 రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

కిడ్నాప్ కేసు.. గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 06:21 PM