Share News

భారత్‌, బ్రెజిల్‌ మధ్య వాణిజ్యం వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్‌ డాలర్లకు పెంపు

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:05 AM

భారత్‌, బ్రెజిల్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 20బిలియన్‌ డాలర్లకు(రూ.1.81లక్షల కోట్లు) పెంచుకోవాలని ప్రధాని మోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా...

భారత్‌, బ్రెజిల్‌ మధ్య వాణిజ్యం వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్‌ డాలర్లకు పెంపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత్‌, బ్రెజిల్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 20బిలియన్‌ డాలర్లకు(రూ.1.81లక్షల కోట్లు) పెంచుకోవాలని ప్రధాని మోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా నిర్ణయించారు. క్రిటికల్‌ మినరల్స్‌ విషయంలో పరస్పర సహకారం కోసం ఒప్పందం కూడా చేసుకున్నారు. రక్షణ, విద్యుత్‌, ఆరోగ్యం, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో కూడా సహకరించుకోవాలని నిర్ణయించారు. ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొనడం కోసం ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఇండియాకు వచ్చిన లులా డసిల్వా ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. శనివారం ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ 12బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇందులో భారత్‌ ఎగుమతులు 6.77బిలియన్‌ డాలర్లు కాగా, బ్రెజిల్‌ ఎగుమతులు 5.43బిలియన్‌ డాలర్లు.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:05 AM