నేడు భారత్ బంద్.. బ్యాంకింగ్ సేవలపై ప్రభావం!
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:13 AM
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం భారత్ బంద్‌కు 10కిపైగా వాణిజ్య, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ సేవలు, రవాణాతో...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం భారత్ బంద్‌కు 10కిపైగా వాణిజ్య, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ సేవలు, రవాణాతో పాటు మరికొన్ని ప్రభుత్వ రంగాలపై బంద్ ప్రభావం ఉండనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు బంద్‌లో పాల్గొంటారని 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పేర్కొంది. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ బంద్ తలపెట్టాం’ అని వివరించారు. ఆస్పత్రులు, అత్యవసర సేవలు, అంబులెన్స్, ఆరోగ్య సేవలు, పాలు, ఫార్మసీల వంటి సేవలు కొనసాగుతాయి. ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, మెట్రో సేవలు, పాఠశాలలు, కాలేజీలు కొనసాగే అవకాశముంది.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News