Share News

పెట్రోల్‌లో ఇక 30 శాతం వరకు ఇథనాల్‌

ABN , Publish Date - May 21 , 2026 | 04:52 AM

ట్రోల్‌లో 30ు వరకు ఇథనాల్‌ను కలిపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం మన దేశంలో 20ు వరకే అనుమతి ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న...

పెట్రోల్‌లో ఇక 30 శాతం వరకు ఇథనాల్‌

  • కేంద్రం నోటిఫికేషన్‌.. ఇథనాల్‌ పరిశ్రమ హర్షం

న్యూఢిల్లీ, మే 20: పెట్రోల్‌లో 30ు వరకు ఇథనాల్‌ను కలిపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం మన దేశంలో 20ు వరకే అనుమతి ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ (బీఐఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ 22, ఈ 25, ఈ 27, ఈ 30 చమురు మిశ్రమాలకు సంబంధించిన నిబంధనలను దీంట్లో వివరించారు. ఈ మిశ్రమాలు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ శాతాలకు (22ు, 25ు, 27ు, 30ు) సంబంధించినవి. అధికమొత్తం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను వినియోగించుకునే ఇంజిన్ల సాంకేతిక సామర్థ్యం, వాహనాలను సురక్షితంగా ఉంచటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెట్రోల్‌లో ఎంత శాతం మేర ఇథనాల్‌ను కలపాలి, ఆక్టేన్‌, సల్ఫర్‌ స్థాయిలు, ఇంధనం స్థిరత్వం తదితర అంశాల గురించి ఈ నోటిఫికేషన్‌లో మార్గదర్శకాలు పొందుపరిచారు. దేశంలో ఇథనాల్‌ అదనపు నిల్వలు అందుబాటులో ఉన్నందున పెట్రోల్‌లో కలుపుతున్న ఇథనాల్‌ శాతాన్ని మరింత పెంచాలని సంబంధిత పరిశ్రమలు, బయోఫ్యూయల్‌ తయారీదార్లు గత కొంతకాలంగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనివల్ల చమురు దిగుమతులను కొంత తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. కేంద్రం నిర్ణయంపై ఇథనాల్‌ లాబీ ‘ఆలిండియా డిస్టిలర్స్‌ అసోసియేషన్‌’ హర్షం వ్యక్తం చేసింది. ఇది పర్యావరణానికి కూడా ప్రయోజనం కలిగించే నిర్ణయమని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

Updated Date - May 21 , 2026 | 04:52 AM