Share News

అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఏటీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:37 AM

విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆటోమేటెడ్‌ ఎక్స్‌రే ట్రే రిటర్న్‌ సిస్టమ్‌(ఏటీఆర్‌ఎస్‌) వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది...

అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఏటీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆటోమేటెడ్‌ ఎక్స్‌రే ట్రే రిటర్న్‌ సిస్టమ్‌(ఏటీఆర్‌ఎస్‌) వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడితో కలసి హోం మంత్రి అమిత్‌ షా... కేంద్ర హోం, ఐబీ, సీఐఎ్‌సఎఫ్‌, పౌర విమానయాన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలు చేశారు. ‘ఇకపై కొత్తగా నిర్మించే విమానాశ్రయాల్లో ఏటీఆర్‌ఎస్‌ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 21విమానాశ్రయాలు, ఇతర 41విమానాశ్రయాల పనులను ప్రయాణికుల రద్దీ ప్రతిపాదికన వేగవంతం చేసి రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలి. 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యాలయాల్లో ఫారిన్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీ్‌స(ఎ్‌ఫఆర్‌ఆర్‌వో) కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురావాలి. 16 ప్రధాన విమానాశ్రయాల్లో ఉన్న బ్యాగేజ్‌ డ్రాప్‌ సదుపాయాన్ని అధిక రద్దీ ఉన్న ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలకూ విస్తరించాలి’ అని అమిత్‌ షా ఆదేశించారు.

ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 09 , 2026 | 05:37 AM