రేపటి నుంచి ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:56 AM
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహణకు న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ సమ్మిట్ భారత్ మండపంలో...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహణకు న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ సమ్మిట్ భారత్ మండపంలో జరగనుంది. ఇందులో పాల్గొనబోయే దేశాల నాయకులతో కూడిన జాబితాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్‌లో మొట్టమొదటి ప్రధాన ప్రపంచ ఏఐ సమావేశంగా నిలువనుంది. కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు, దాని ఆర్థిక ప్రభావం, పాలనా విధానాలకు సంబంధించి 20 దేశాల నాయకులు, మంత్రులు, గ్లోబల్ సీఈవోలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు చర్చించే అవకాశం ఉంది. 45కు పైగా దేశాల నుంచి మంత్రివర్గ ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. చర్చల్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు చర్చల్లో పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News