Share News

MEA: ఇరాన్‌లో హింసాత్మక నిరసనలు.. భారత పౌరులకు ఎంఈఏ అడ్వయిజరీ

ABN , Publish Date - Jan 05 , 2026 | 09:18 PM

ఇరాన్‌లోని భారత పౌరులు తగిన జాగ్రతలు తీసుకోవాలని, నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారులు, వార్తా సంస్థల అప్‌డేట్స్‌ను ఎప్పుటికప్పుడు ఫాలో కావాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది.

MEA: ఇరాన్‌లో హింసాత్మక నిరసనలు.. భారత పౌరులకు ఎంఈఏ అడ్వయిజరీ
Randhir Jaiwal

న్యూఢిల్లీ: ఇరాన్ (Iran)లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నందున భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) సోమవారంనాడు అడ్వయిజరీ జారీ చేసింది. ఇరాన్‌లోని భారత పౌరులు తగిన జాగ్రతలు తీసుకోవాలని, నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారులు, వార్తా సంస్థల అప్‌డేట్స్‌ను ఎప్పుటికప్పుడు ఫాలో కావాలని సూచించింది. అలాగే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్స్‌ నుంచి సమాచారం చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


iran.jpg

రెసిడెంట్ వీసాపై ఇరాన్‌లో ఉంటున్న భారత పౌరులు ఇప్పటికే భారత రాయబార కార్యాలయంలో రిజిస్టర్ కాకపోతే వెంటనే చేసుకోవాలని కూడా ఎంఈఏ సూచించింది. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రజల్లో నిరసన అంతకంతకూ తీవ్రమవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.


ఇవి కూడా చదవండి..

లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం.. ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2026 | 10:13 PM