Share News

ఆగస్టు 15న జెండా పండుగను సగర్వంగా నిర్వహించుకుందాం: ప్రధాని మోదీ..

ABN , Publish Date - Aug 11 , 2026 | 06:09 PM

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఆగస్టు 15న జెండా పండుగను సగర్వంగా నిర్వహించుకుందాం: ప్రధాని మోదీ..
PM Modi New Video

ఢిల్లీ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా ‘హర్ ఘర్ త్రివర్ణ’ ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.


ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆగస్టు 15ని గర్వంగా జరుపుకోండి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించండి, వికసిత్ భారత్‌ కోసం ప్రతిజ్ఞ చేయండి. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రతి ఇంటిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకలా నిర్వహించాలని కోరారు.


త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ సేవలందించేందుకు అది నిరంతరం స్ఫూర్తినిస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈసారి హర్ ఘర్ త్రివర్ణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని, భారత్‌ నిర్మాణానికి దోహదపడాలని ఆకాంక్షించారు. అలాగే, ఈ ఏడాది వందేమాతరం జాతీయ గీతం ఇతివృత్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మోదీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏళ్ల తర్వాత ఎస్‌బీఐ లాకర్ తెరిచిన మహిళకు షాక్..

ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..

Updated Date - Aug 11 , 2026 | 07:47 PM