అమెరికా ఫలితాల ప్రభావం ప్రపంచం అంతా!
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:34 AM
మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు తగిలిన ఎదురు దెబ్బ ప్రభావం కేవలం అమెరికాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉంది
న్యూఢిల్లీ, నవంబరు 4: మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు తగిలిన ఎదురు దెబ్బ ప్రభావం కేవలం అమెరికాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాలు, టారి్‌ఫల విషయంలో ట్రంప్ ఏకపక్ష వైఖరికి ఇక బ్రేక్ పడనుంది. అమెరికా కాంగ్రె్‌సపై ట్రంప్ పట్టుకోల్పోయిన నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో సంబంధాలపై పునఃసమీక్ష చేసుకొనే అవకాశం ఉంది. ఫలితంగా పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు మారే సూచనలున్నాయి.
ఇరాన్‌తో యుద్ధం: ఇరాన్‌తో యుద్ధాన్ని డెమోక్రాట్లు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడంతో సగటు అమెరికన్లు కూడా యుద్ధంపై వ్యతిరేకతతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌లో పట్టు సాధించిన డెమోక్రాట్లు శాంతి ఒప్పందం కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఇరాన్‌పై యుద్ధం కోసం ట్రంప్ ఏదైనా సైనిక ఖర్చు ప్రతిపాదన పెడితే కాంగ్రెస్‌లో అది వీగిపోయి, ట్రంప్ అధికారాలకు కళ్లెం పడుతుంది. ట్రంప్ ఓటమితో కొన్ని గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధం: ఇరాన్‌తో యుద్ధంపై వ్యతిరేకతతో ఉన్న డెమోక్రాట్లు ఉక్రెయిన్‌కు మాత్రం మద్దతు ఇస్తున్నారు. ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లలో కూడా చాలా మంది ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సాయం చేయాల్సిందేనని చట్టసభల్లోనూ నొక్కి చెప్పారు. కానీ, ఇప్పటివరకు ట్రంప్ ఏకపక్షంగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం నిలిపివేశారు. దీంతో పాటు, రష్యాపై ఆంక్షలు తొలగించి, వాణిజ్యానికి మరింత వెసులుబాటు కల్పించారు. రష్యా చమురును అమెరికా కొంటుందని ప్రకటించారు. కాంగ్రె్‌సపై డెమోక్రాట్ల పట్టుతో దీనికి బ్రేక్ పడే అవకాశం ఉంది.
చమురు ధరలు: ఇరాన్‌పై యుద్ధానికి భారీ స్థాయిలో నిధులివ్వడానికి అమెరికా కాంగ్రెస్ అనుమతించకపోతే క్రమంగా యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. ఫలితంగా హోర్ముజ్, మాందేబ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి చమురు రవాణా పెరుగుతుంది. దీంతో, చమురు ధరలు తగ్గుతాయి. అంతే కాకుండా ఏదైనా శాంతి ఒప్పందం కుదిరితే ఇరాన్ చమురు కూడా ప్రపంచ మార్కెట్‌లోకి వస్తుంది. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజా, లెబనాన్‌లో చేస్తున్న దాడులపై అమెరికా నిఘా పెరగొచ్చని, ఆ దేశం యథేచ్చగా దాడులు చేయడానికి ఇక వీలు ఉండదని, ఆ దేశానికి మిలిటరీ సాయంపైన కూడా అమెరికా పునరాలోచించుకోవచ్చని అంచనా.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!
ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..